Home Blog Page 9

బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్..!

0

గతంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని దోచుకున్న దొంగలు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తాజాగా మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. మూసీలోని మురికి కంటే వారి మెదడులోనే మురికి ఎక్కువగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతల సవాల్‌ను స్వీకరిస్తూ మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌పై చర్చించడానికి ఎక్కడికి రమ్మన్న ఒంటరిగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వస్తానని సవాల్ విసిరారు.

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

0

ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,758.07 పాయింట్ల (క్రితం ముగింపు 81,501.36) వద్ద లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లో కూరుకుపోయింది. ఇంట్రాడేలో 80,905.64 కనిష్ట స్థాయిని తాకిన సూచీ, చివరికి 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 221.45 పాయింట్ల నష్టంతో 24,749.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
సెన్సెక్స్‌లో నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడ్డాయి
బజాజ్ ఆటో షేర్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో 13.11 శాతం నష్టంతో రూ.1523 నష్టంతో రూ.10,093.50 వద్ద ముగిసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు

0

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే ఐదురోజులపాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో పెరుగనున్న మద్యం ధరలు..?

0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచనున్నది అని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు కోరుతున్నాయి. అయితే అదే కానీ నిజమైతే మద్యం ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.సాధారణంగా ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి ధరలను పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150కి పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఏటా దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. ఈసారి తెలంగాణ మందు బాబులు పది రోజుల్లోనే రూ.1100 కోట్లకు పైగా మద్యం తాగారు.ఈసారి కూడా మద్యం విక్రయాల్లో హైదరాబాద్‌ ముందుంది.

రైళ్లలో జనరల్ బోగీలు ముందు, చివర ఎందుకుంటాయో ఆలోచించారా..! ఎందుకో తెలుసా..?

0

రైళ్లలో జనరల్ బోగీలు ముందు మరియు చివర ఊడడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. ప్రతి రైలు లేఅవుట్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అంటే, ఇంజిన్ వెనుక, AC-3, AC-2, స్లీపర్ కోచ్‌లు మరియు చివరకు జనరల్ కోచ్‌లు రైలు వెనుక వైపు అమర్చబడి ఉంటాయి. రైలు ముందు లేదా వెనుక ఎల్లప్పుడూ జనరల్ కోచ్‌లను ఉంచడం ద్వారా రైల్వే ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటోందని ప్రజలు తరచుగా ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవం అదికాదు.

భారతీయ రైల్వే ప్రకారం, స్లీపర్ మరియు AC కోచ్‌ల కంటే రైలు సాధారణ కోచ్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ కోచ్‌లు ప్రతి స్టేషన్‌లో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కుతారు. అందుకని ఖచ్చితంగా జనం ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రైలు మధ్యలో జనరల్ కోచ్‌లు వేస్తే రైలు మధ్యలో ఎక్కువ బరువు ఉండి రైలు బ్యాలెన్స్‌ ఉండదు. బోర్డింగ్ మరియు డిబోర్డింగ్‌లో కూడా సమస్యలు ఉంటాయి. జనరల్ కంపార్ట్‌మెంట్ మధ్యలో ఉంటే, అది సీటింగ్ అమరికతో పాటు ఇతర ఏర్పాట్లపై ప్రభావం చూపుతుంది.

రైలు ముందు మరియు వెనుక పబ్లిక్ కోచ్‌లను ఉంచడం ద్వారా, ప్రయాణికుల రద్దీ సమానంగా విభజించబడింది. అలాగే, ప్రతిగా రెండు వైపులా ఇంజన్లను కనెక్ట్ చేయడం వల్ల రైలు బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. రైల్వే నిపుణుల అభిప్రాయం ప్రకారం, రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌ను జోడించడం ప్రయాణీకుల భద్రత పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ప్రమాదం, పట్టాలు తప్పడం లేదా అగ్నిప్రమాదం వంటి అత్యవసర పరిస్థితుల్లో, పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో ఉన్న ఈ కోచ్‌ల నుండి ప్రజలను వెంటనే తరలించవచ్చు.

ఈసారి ‘అన్ స్టాపబుల్ 4’ టాక్ షోలో… బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..?

0

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’.. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ టాక్ షో నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ షో లో పెద్ద స్టార్ హీరోలు, పలువురు రాజకీయ నాయకులు హాజరై బాలయ్యతో సందడి చేశారు.
ఇప్పుడు సీజన్ 4లో కూడా అదే రేంజ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేస్తారని సమాచారం. చిరంజీవి, బాలయ్య… వీరిద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఈ సీజన్‌లో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలో పుష్ప 2 కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సీజన్ లో అల్లు అర్జున్, సుకుమార్ కూడా వచ్చి సందడి చేస్తారని సమాచారం. అలాగే స్టార్ బ్యూటీ సమంత కూడా సందడి చేయనుంది. అంతేకాదు ఈ సీజన్ లో శ్రీలీల కూడా మెరుస్తుందని సమాచారం. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ సీజన్ 4పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అకాల వర్షాలకు తడిసి ధాన్యం.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలి..!

0

ఇదే నిజం : ముస్తాబాద్ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి. నర్సింహారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తురథిగతగా కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్నటి రోజున కురిసిన భారీ వర్షం కారణంగా రైతుల పంట పొలాలకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే ముందస్తుగా కొనుగోలు చేసిన ధాన్యంను.. కేంద్రాలలో ఉంచగా ఆ ధాన్యం అంత వర్షానికి తడిసి ముద్దయింది పలుచోట్ల వర్షానికి ధాన్యం కల్లాలలో కొట్టుకపోయింది అని తెలిపారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అలాగే తొందరగా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎఫ్ పార్టీ నాయకులు తాళ్ల రాజు ,గుండవేని సతీష్,కంచం నర్సింలు, దోరగొల్ల బాలెళ్ళు రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

10:30 దాటినా కళాశాలకు తాళం

0

ఇదే నిజం జుక్కల్: జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలం జూనియర్ కళాశాలకు గురువారం ఉదయం 10:30 గంటలు దాటినా అధ్యాపకులు, విద్యార్థులు రాలేదు. 21 మంది విద్యార్థులతో ఈ విద్యా సంవత్సరం జూనియర్ కళాశాలను ప్రారంభించారు. మొన్నటి వరకు లెక్చరర్ల నియామకం లేకపోవడంతో పిట్లం జూనియర్ కళాశాల నుంచి లెక్చరర్లు వచ్చి ఒకటి రెండు తరగతులు అప్పుడప్పుడు నిర్వహించేవారు. లెక్చరర్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో తెలియకపోవడంతో విద్యార్థులు సైతం కళాశాలకు అప్పుడప్పుడు వచ్చేవారు. గత పది రోజుల కిందట నిజాంసాగర్ జూనియర్ కళాశాలకు ఓ లెక్చరర్ ను నియమించారు. అయినప్పటికీ గురువారం ఉదయం 10:30 గంటలు దాటినా లెక్చరర్ కళాశాలకు రాకపోవడంతో తాళాలు తీయలేదు. ఎలాగో లెక్చరర్లు రావడంలేదని విద్యార్థులు సైతం కళాశాలకు రావడం మానేశారు. అసలు కళాశాలలో తరగతులు జరగడంలేదని, పుస్తకాలు సైతం ఇంకా అందజేయలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి నిజాంసాగర్ కళాశాలను గాడిలో పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రతి రోజూ పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగితే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

0

ప్రతి రోజూ పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. కీలక ప్రకటన చేసే ఛాన్స్..!

0

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మూసీ ప్రాజెక్టు, హైడ్రా, గ్రూప్-1, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.