Homeజిల్లా వార్తలువైజాగ్ కాలనీలో యువకుడి మృతదేహం లభ్యం

వైజాగ్ కాలనీలో యువకుడి మృతదేహం లభ్యం

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం నేరడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకొండకి చెందిన మహమ్మద్ మునీబుద్దిన్ (22) బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జలాలను చూసేందుకు వెళ్లారు. కృష్ణా జలాల్లో దిగి ఈత రాక గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో వెతకగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.

Recent

- Advertisment -spot_img