బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘గూఢచారి 2’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ సెట్లో ఓ యాక్షన్ సీన్లో భాగంగా ఓ చోట నుంచి మరో చోటికి దూకుతుండగా మెడకు దెబ్బ తగిలింది. మెడపై కట్ అయి రక్తం వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నాడు.