Homeఫ్లాష్ ఫ్లాష్ఆ అమ్మాయి ర‌ణ్‌వీర్‌కి బ్రేక‌ప్ చెప్పి ఆదిత్య‌క‌పూర్‌కి ద‌గ్గ‌ర‌యింద‌ట‌

ఆ అమ్మాయి ర‌ణ్‌వీర్‌కి బ్రేక‌ప్ చెప్పి ఆదిత్య‌క‌పూర్‌కి ద‌గ్గ‌ర‌యింద‌ట‌

ముంబయి: ఐదేండ్లు ప్రెమించిన ఓ అమ్మాయి నాకు బ్రేక‌ప్ చెప్పి ఆదిత్యా రాయ్ క‌పూర్‌కు ద‌గ్గ‌రైంద‌ని బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్ చెప్పాడు.

2017లో నేహా ధుపియా రేడియో చాట్‌ షో సీజన్‌ 2లో ఆయన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జూనియర్‌ కాలేజీలో అమ్మాయిలు అతడ్ని (ఆదిత్య) తెగ ఇష్టపడేవారని గుర్తు చేశారు. ఇప్పుడా అమ్మాయికి పెండ్లై ఓ పిల్లాడు కూడా ఉన్నాడ‌ని కాలేజీ రోజుల‌ను ర‌ణ్‌వీర్ గుర్తు చేసు్కున్నారు.

దీనిపై ఆదిత్య స్పందించాడు. ‘రణ్‌వీర్‌ ఎలా ఫీల్‌ అయ్యాడో, ఏం అనుకున్నాడో నాకు తెలియదు. కానీ వాళ్లిద్దరు విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత ఆ అమ్మాయిని నేను చూశా’ అని వివరించారు.

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌-లీలా’ సినిమా షూటింగ్‌లో వీరు ప్రేమలోపడ్డ రణ్‌వీర్‌, దీపికా పదుకొణె 2018 నవంబరు 14న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img