Homeహైదరాబాద్latest Newsబాంబు బెదిరింపులు..వణుకుతున్న బెంగళూరు

బాంబు బెదిరింపులు..వణుకుతున్న బెంగళూరు

దేశంలో వరుసగా బాంబు బెదిరింపులు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రముఖ నగరాలను టర్గెట్ చేసినట్లుగా ఈమెయిల్స్ వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు లోని ప్రముఖ హోటల్‌ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ నుంచి ఇవి వచ్చినట్లు ఆయా యాజమాన్యాలు తెలిపాయి. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించారు.

సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వీటి సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని.. తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

ఇటీవల దేశ రాజధాని దిల్లీలోని వందకు పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. నాడు అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అదంతా బూటకమని తేలింది. కొన్ని గంటల క్రితమే నార్త్‌ బ్లాక్‌లోని పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్‌ బెదిరింపు వచ్చింది. కానీ, అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదు.

Recent

- Advertisment -spot_img