Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల ఉత్సవాలు.. పాఠశాలల్లో ముందస్తుగా ఘనంగా బోనాలు

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల ఉత్సవాలు.. పాఠశాలల్లో ముందస్తుగా ఘనంగా బోనాలు

ఇదే నిజం, ముస్తాబాద్: మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీవాణి, నవ జ్యోతి, మహర్షి బాలమిత్ర పాఠశాలల్లో ఆషాడమాసంలో బోనాల ఉత్సవాలనూ ప్రచురించుకొని విద్యార్థిని విద్యార్థులు అమ్మవారి వేషధారణలో పోతురాజుల నుత్యాలతో పలువురుని ఆకట్టుకునేలా ఆటపాటలతో అలరించారు. బోనాల ప్రత్యేకతను విద్యార్ధులకు తెలియజేసారు. పాఠశాల కరస్పాండెంట్ లు, అమ్మవారికి బోనం తీసి మొక్కలు సమర్పించారు. ఆషాడ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళతారు . అమ్మవారిని భోనంతో ఎదుర్కొని ఓడి బియ్యం, చీరే,సారెలను అమ్మ వారికి అందించి పూజిస్తారు. విద్యార్థులు చదువుతో పాటుగా తమ సంస్కృతి ఆచార సంప్రదాయాలను గురించి తెలుసుకోవాలని కరస్పాండెంట్ లు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్ లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img