Homeహైదరాబాద్latest NewsYouTube లో Boyapati రికార్డు.. 800 మిలియన్ Views

YouTube లో Boyapati రికార్డు.. 800 మిలియన్ Views

ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల హవా కొనసాగుతున్న క్రమంలో కూడా ఓ సినిమా యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతుంది. ఒకప్పుడు బోరింగ్ సోది అన్న అదే సినిమా ఎప్పుడు కొత్త ట్రెండ్ లో దూసుకుపోతుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో.. ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు అయిన.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన ఈ సినిమా 2017 లో రిలీజ్ అయింది.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకీ నాయక’ సినిమా ఇటీవల హిందీలోకి డబ్ అయింది. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు మాత్రం పడుతున్నారు. రీసెంట్​గా హింది వర్షన్ తో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా ఇదేనని .. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న పెస్ స్టూడియోస్ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img