తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని తెలిపింది.
మొదటి డోస్‍కు బ్రేక్ ఇచ్చి రెండో డోస్ కంప్లీట్ చేయదలచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇస్తామని ప్రకటించింది.