తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో జరుగుతున్నాయి. అయితే ఈరోజు జరిగిన గ్రూప్ 2 పరీక్షలో ఒక అభ్యర్థి మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుపడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కళాశాల పరీక్షా కేంద్రంలో చోటుచేసుకుంది.పరీక్ష ప్రారంభానికి ముందు ఓ అభ్యర్థి తన బట్టల్లో మడతపెట్టిన మొబైల్‌తో వచ్చాడు. అనుమానం రావడంతో చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ తనిఖీ చేశారు. ఆ అభ్యర్థి ఫోన్ దొరకడంతో పరీక్ష రాయనివ్వకుండా అతడిని పోలీసులకు అప్పగించారు.నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం అతనిపై మాల్ ప్రాక్టీస్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.