Homeహైదరాబాద్latest NewsBREAKING: యూటర్న్ తీసుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు షాకిచ్చి.. మళ్ళీ సొంత గూటికి...

BREAKING: యూటర్న్ తీసుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు షాకిచ్చి.. మళ్ళీ సొంత గూటికి గద్వాల ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అనుహ్యంగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగుతున్న సమయంలోనే బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేక పోతున్నట్లు ఆయన వెల్లడించనట్లు సమాచారం. కాగా, బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు.

Recent

- Advertisment -spot_img