Homeహైదరాబాద్latest NewsBREAKING: జంట హత్యల కలకలం.. అన్నదమ్ములు మధ్య ఆస్తి తగాదాలు..ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి..ఏం జరిగింది..?

BREAKING: జంట హత్యల కలకలం.. అన్నదమ్ములు మధ్య ఆస్తి తగాదాలు..ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి..ఏం జరిగింది..?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపాయి. ఇద్దరు అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. రాజమండ్రిలోని శంభునగర్ రైల్వే ట్రాక్‌పై వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు సాయినగర్‌కు చెందిన దుర్గారావు, ఆంజనేయులుగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. కానీ ఇద్దరూ హత్యకు గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. వీళ్ళను ఎవరైనా చంపారా? లేదా ఒకరినొకరు చంపుకున్నారా? అన్న విషయం తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img