ఏపీలో పలు చోట్ల పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. పెన్షన్ల పంపిణీ సర్వర్‌లో సాంకేతిక లోపం రావడంతో లబ్ధిదారుల ఐరిష్, వేలి ముద్రలు పడకపోవడంతో పంపిణీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటలగా ఇదే సమస్య తలెత్తుతుండడంతో.. సర్వర్ లోపంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉదయం 10 గంటలకు 30% పంపిణీ పూర్తవగా.. గత రెండు గంటలగా కేవలం 1% మాత్రమే పంపిణీ పూర్తయిందట.