సార్వత్రిక ఎన్నికల ప్రచారాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) హెచ్చరించింది. కుల, మత ప్రస్తావనలు, సైనిక బలగాలను రాజకీయం చేయవద్దని సూచించింది. రాజ్యాంగం రద్దవుతుందనే అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోరింది. ప్రచారాల్లో సంయమనం పాటించాలని హితవు పలికింది. ఇకనైనా సరిదిద్దుకోవాలని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.