Homeహైదరాబాద్latest NewsBreaking: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్.. అసలు ఏం జరిగిందంటే..?

Breaking: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్.. అసలు ఏం జరిగిందంటే..?

ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిశాక.. ఎమ్మెల్యేలలో తొలుత జగన్‌తోనే ప్రమాణ స్వీకారం చేయించడం విశేషం. ఆయన తర్వాతే మిగిలిన కూటమి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వెంటనే ఆయన సభ నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదా రాకపోవడంతో సభలో జగన్‌‌కు సీటు ఎక్కడ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

Recent

- Advertisment -spot_img