Homeహైదరాబాద్latest NewsBREAKING: తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ.. అసలు ఎవరీ జిష్ణుదేవ్..?

BREAKING: తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ.. అసలు ఎవరీ జిష్ణుదేవ్..?

తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు, ఎమ్మెలేలు పాల్గొన్నారు. జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న త్రిపురలో జన్మించారు. 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా జిష్ణుదేవ్ వర్మ పని చేశారు. అంతేకాకుండా గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ రాబాదంతో.. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img