Homeహైదరాబాద్latest NewsBREAKING: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్.. నూతన డీజీపీ నేపథ్యం ఇదే..!

BREAKING: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్.. నూతన డీజీపీ నేపథ్యం ఇదే..!

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్త హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నూతన డీజీపీ జితేందర్ పంజాబ్‌‌లోని జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img