Homeహైదరాబాద్latest NewsBREAKING: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్.. ఆయన నేపథ్యం ఇదే..!

BREAKING: తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్.. ఆయన నేపథ్యం ఇదే..!

జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు.

జస్టిస్ మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్‌ 31న జన్మించిన లోకూర్, 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిధులు నిర్వర్తించారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లోకూర్‌ నియమితులయ్యారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్‌ లోకూర్‌ ఒకరు.

Recent

- Advertisment -spot_img