భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు సోమవారం ఊరట లభించింది. ఆయనకు జార్ఖండ్ హైకోర్టులో మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ED ఆశ్రయించింది. ED దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దానిపై విచారించిన కోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది.