Homeహైదరాబాద్latest NewsBREAKING: తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ సారా వ్యవహారం.. 35 మంది మృతి.. మరింత పెరిగే...

BREAKING: తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ సారా వ్యవహారం.. 35 మంది మృతి.. మరింత పెరిగే అవకాశం..!

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

కల్తీ సారా వ్వవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతుంది. కల్తీ సారా సేవించిన వారు వరుసగా మృతి చెందుతుండటంతో.. అప్పటికే సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రి బాధితులతో నిండిపోయింది. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి.

Recent

- Advertisment -spot_img