Homeహైదరాబాద్latest NewsBREAKING: వామ్మో..మళ్ళీ పెళ్లా?.. నాలుగో పెళ్ళికి రెడీ అయిన నటి వనితా విజయ్ కుమార్..!

BREAKING: వామ్మో..మళ్ళీ పెళ్లా?.. నాలుగో పెళ్ళికి రెడీ అయిన నటి వనితా విజయ్ కుమార్..!

వనితా విజయ్ కుమార్.. కోలీవుడ్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు. వనితా విజయ్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో వివాదాలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పెళ్లిళ్లు, విడాకులు, కోర్టులు, కేసులు.. ఇలా ఒకటని చెప్పలేం. ఇక ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వనితా.. తాజాగా నాలుగో పెళ్ళికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. వనిత విజయ్ కుమార్ 2000 సంవత్సరంలో హీరో ఆకాష్ ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు.

ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వరుసగా పెళ్లిళ్లు చేసుకొని అవి పెటాకులు అవ్వడంతో.. ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాల పై పెట్టింది. కానీ ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు ఆమె నాలుగోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. వనితకు అనుకున్నంతగా సినిమాలు రాకపోయినా.. యూట్యూబ్ ఛానెల్ పెట్టి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. ఊహించని దారి గురించి ఎదురుచూడండి అంటూ చెప్పిందట వనిత విజయ్ కుమార్. అయితే ఈ కామెంట్ చేయడం వెనక ఆమె మరోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని ఫిలిం సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు వనిత నాలుగో పెళ్లి గురించిన టాక్ రావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి వనిత నాలుగో పెళ్లి వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img