Homeహైదరాబాద్latest Newsబ్రదర్..ఆ బ్లడ్‌లో ఉండే పవరే వేరు

బ్రదర్..ఆ బ్లడ్‌లో ఉండే పవరే వేరు

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : సృష్టిలో ఎన్నో బంధాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకం. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు ఇలా చాాలానే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా కష్టకాలం, సమస్యల్లో అన్న/తమ్ముడు హెల్ప్‌గా ఉంటారు. బాధల్ని మరిచిపోయి, సంతోషంగా జీవించేలా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందులో భాగంగా కుటుంబంలో అన్నదమ్ముల పాత్ర, వారి గౌరవాన్ని తెలిపేందుకు ఒక రోజును కేటాయించారు. 2005 నుంచీ ఏటా మే 24 న జాతీయ సోదరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు..మీకోసం

ఆ బ్లడ్‌లో ఉండే పవరే వేరు

అన్నదమ్ముల బంధం ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకే తల్లి కడుపున పుట్టిన వారి బాంధవ్యం ఎప్పటికీ తెంచుకోలేనిది. తెగిపోనిది. తన అన్నను గానీ, తమ్మున్ని గానీ వేరే వ్యక్తి ఇన్‌సల్ట్ చేసినా, అవహేళన చేసినా రక్తం మరిగిపోతుంది. అయినవాళ్లైనా సరే. ఎందుకంటే ఆ బ్లడ్‌లో ఉండే పవర్, మ్యాజికే వేరు.

అన్నింటిలో తోడుగా

ఇతర కుటుంబసభ్యులను ఏమన్నా పెద్దగా బాధపడరు కానీ సోదరుని విషయంలో మాత్రం ఆగ్రహం రంకెలేస్తుంది. పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ మంచి ఫ్రెండ్‌గా ఉండేది బ్రదరే. మన మంచి కోరే వ్యక్తి. సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేది. కలిసే తినడం, తిరగడం, పడుకోవడం, కొట్లాడటం, స్కూల్‌కి వెళ్లడం ఇలా ఎన్నో పనుల్లో మనకు ఫస్ట్ నుంచీ పరిచయమున్న వ్యక్తి అన్న/తమ్ముడు. అన్న అనే పిలుపు అమ్మలో సగం, నాన్నలో సగంగా చెబుతుంటారు. ఇది వాస్తవం.

కసిన్ బ్రదర్స్

ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కసిన్ బ్రదర్స్ కూడా కొందరు అన్యోన్యంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా పంచుకుంటారు. ఇబ్బందుల్లో ఆదుకుంటారు. ఎప్పుడూ అండగా ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అన్నదమ్ముల బంధం అనేది ఉంటుంది.

ఎందుకు విడిపోతున్నారు?

ప్రస్తుత సమాజంలో అన్నదమ్ములు చిన్నచిన్న మనస్పర్థాలతో విడిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం. పెళ్లి అయిన తర్వాత సెపరేట్ ఫ్యామిలీగా ఏర్పడటంతో రెస్పాన్సిబిలిటీ కొంచెం తగ్గుతుంది. తన ఫ్యామిలీని పోషించడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో అన్నదమ్ములు విడిపోయే అవకాశం ఉంది. భూతగాదాలు, ఆస్తి పంపకాలు, ఆవారాగా తిరగడం, అక్రమ సంబంధాలు వంటి విషయాలు విడిపోవడానికి కొన్ని కారణాలు.

తక్కువ కాదు

విడిగా ఉంటున్నా, కలిసే ఉంటున్నా ఫైనల్‌గా తను మన బ్రదర్. మన మంచి కోరే వ్యక్తి. ఎప్పుడూ హాని మాత్రం తలపెట్టని పర్సన్. మనతో తక్కువగా మాట్లాడుతుంటాడు కావచ్చు. కానీ రిలేషన్ మాత్రం తక్కువగా ఉండదు. అవసరం, సందర్భాన్ని బట్టి అది కనబడుతుంది. అంతేకానీ మనల్ని పట్టించుకోవడం లేదు, తక్కువగా చూస్తున్నారనేది అవాస్తవం. నిజానికి అలాంటిది ఉండదు. కొందరు మూర్ఖులు మాత్రమే అవగాహనా రాహిత్యంతో గొప్పలకు పోయి, మానవతా విలువలు మరుస్తుంటారు. అలాంటి వారు సైతం చివరికి నిజం తెలుసుకుంటారు. తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడుతుంటారు.

ఎలా ఉండాలి?

ప్రస్తుతం సమాజంలో ఎన్నో కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఆవశ్యకం. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే రిలీఫ్‌గా ఉంటుంది. మన గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి బ్రదర్. కచ్చితంగా మంచి ఉపాయాన్ని, సలహాను ఇచ్చే శక్తి ఉంటుంది. కోపతాపాలకు పోయి దూరంగా ఉంటే ఇద్దరికీ నష్టమే. నచ్చని పని చేస్తున్నప్పుడు సున్నితంగా చెప్పాలి. అర్థమయ్యేలా కన్విన్స్ చేయాలి. అంతేగానీ డైరెక్ట్‌గా నిలదీస్తే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా రిలేషన్‌షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటేనే అది ఎక్కువకాలం నిలబడుతుంది.

ఈ స్పెషల్ డే రోజు మీ బ్రదర్‌కి విషెస్ చెప్పండి.

Wishes for Brother’s Day

1. Happy Brother’s Day! Thank you for always being there and for all the wonderful memories we’ve created together.

2. To the best brother in the world, Happy Brother’s Day! Your support and love mean everything to me.

3. Wishing you a fantastic Brother’s Day! I’m grateful to have you in my life as my brother and my friend.

4. Happy Brother’s Day! You’re not just my brother, but also my role model and hero.

5. Cheers to my incredible brother! May your Brother’s Day be filled with joy and happiness.

Recent

- Advertisment -spot_img