Homeహైదరాబాద్latest Newsఅక్కడ ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలవడం కాయం: KTR

అక్కడ ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలవడం కాయం: KTR

ఇదే నిజం, వికారాబాద్: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయంమని చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలుస్తాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి మరియు గడ్డం రంజిత్ రెడ్డి వీళ్ళ పనితీరు చూస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా తయారైందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి తప్ప మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. పరిగి వికారాబాద్ తాండూర్ ఈ ఒక్క నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి ఇతర పార్టీలకు వెళ్లడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు.

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని 96 కులాలను ఏకం చేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు ప్రజలు అమాయకులు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు 100 రోజుల్లోనే ప్రజలకు అర్థమైందని ఆమె ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏమి మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆమె ప్రశ్నించారు.

నిత్యవసర గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె ఆరోపించారు. రాముని పూజిద్దాం బిజెపిని తొక్కేద్దాం అనే ఆమె అన్నారు. బిజెపి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని తాకట్టు పెడతానని ఆమె ఆరోపించారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్లు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు బీ ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img