HomeSocial Mediaఇక నుంచి BRS కార్యకర్తలు అలా మాట్లాడొద్దు: కేటీఆర్

ఇక నుంచి BRS కార్యకర్తలు అలా మాట్లాడొద్దు: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారనడం సరికాదని.. ఇక నుంచి బీఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడొద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరూ అలా మాట్లాడొద్దని సూచించారు. 

తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించి అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img