త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఇక బీఆర్ఎస్ జాడ ఉండదన్నారు. ఖచ్చితంగా త్వరలో కేసీఆర్ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని అన్నారు. మంత్రి ఏ సందర్బంలో ఈ వ్యాఖ్యలు చేశారోనని పలువురు చర్చించుకుంటున్నారు.