– గన్ పార్క్ వద్ద ‘జై తెలంగాణ’నినాదాలు
ఇదే నిజం, హైదరాబాద్: గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష(బీఆర్ఎస్ఎల్పీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశానికి బయల్దేరారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు జోహార్లు.., జై తెలంగాణ నినాదాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోరెత్తించారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు.