Homeహైదరాబాద్latest Newsకేసీఆర్​ గ్రాండ్​ ఎంట్రీకి బీఆర్ఎస్​ ప్లాన్​.. నల్లగొండ సభలో మాట్లాడబోయే ప్రధాన అంశం ఇదే

కేసీఆర్​ గ్రాండ్​ ఎంట్రీకి బీఆర్ఎస్​ ప్లాన్​.. నల్లగొండ సభలో మాట్లాడబోయే ప్రధాన అంశం ఇదే

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ జనంలోకి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన ఇప్పటివరకు బహిరంగసభల్లో, పత్రికా సమావేశాల్లో పాల్గొనలేదు. దీంతో కేసీఆర్ కు గ్రాండ్ ఎంట్రీ తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్​ ప్లాన్​ చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం బీఆర్ఎస్​ పార్టీకి వరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్​ సర్కారు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మినిట్స్​ కూడా విడుదలయ్యాయి. దీంతోనే బీఆర్ఎస్​ పోరాటానికి రెడీ అయ్యింది. నల్లగొండ సభను ఇందుకు వేదిక చేసుకున్నది. ఇక తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి రావడంతో తెలంగాణ వాదుల నుంచి కూడా బీఆర్ఎస్​ పార్టీకి మద్దతు రావడం మొదలైంది. ఇదిలా ఉంటే ఉత్పాతాన్ని ముందే గ్రహించిన కాంగ్రెస్​ పార్టీ సోమవారం అసెంబ్లీలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది. తాము చలో నల్లగొండ సభకు పిలుపునివ్వడం వల్లే కాంగ్రెస్​ పార్టీ వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్​ నేతలు ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని హరీశ్​ రావు ఎంతో సక్సెస్​ ఫుల్ గా అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఒకవేళ బీఆర్ఎస్​ పార్టీ కనక ఈ అంశాన్ని ఎత్తుకోకపోతే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్లిపోయేవని హరీశ్​ అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మొత్తం సభ ముందుంచారు.

నల్లగొండ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు?

ఇక నల్లగొండ సభలో కేసీఆర్​ ఏం మాట్లాడబోతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్​ ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్​ పార్టీ మెడలు వంచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పాలు కాకుండా కాపాడామని రేపటి సభలో బీఆర్ఎస్​ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. ఈ సభ ను పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభగా వాడుకోవాలని బీఆర్ఎస్​ ప్రయత్నిస్తోంది. ఇక తెలంగాణ హక్కులకు భంగం కలిగితే.. తెలంగాణ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్​ సర్కారు వెంటనే మేల్కొన్నది. రేపు ముఖ్యమంత్రి రేవంత్​, కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు తరలివెళ్లనున్నారు. ఇటు కేసీఆర్​ సభ, అటు ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సర్కారు అవినీతి పాల్పడిందని చెప్పేందుకు కాంగ్రెస్​ యత్నింస్తుండగా.. కాంగ్రెస్​ హాయంలో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. బీఆర్ఎస్​ ప్రచారం చేయబోతున్నది. ఈ రెండు అంశాలే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయి. ఇక నల్లగొండ సభకు బీఆర్ఎస్​ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జనసమీకరణ కూడా చేశారు. మరి ఈ సభలో కేసీఆర్​ ఏం మాట్లాడబోతున్నారో.. వేచి చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img