Homeహైదరాబాద్latest NewsBuddha Purnima: బుద్ధునికి జ్ఞానోదయం ఏ విధంగా కలిగిందో మీకు తెలుసా..?

Buddha Purnima: బుద్ధునికి జ్ఞానోదయం ఏ విధంగా కలిగిందో మీకు తెలుసా..?

బుద్ధుని పుట్టిన రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ వేడుకలను ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోని బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గౌతమ బుద్ధునిగా అవతరించిన బౌద్ధమత స్థాపకుడు యువరాజు సిద్ధార్థ గౌతమ పుట్టినరోజు జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు. బుద్ధ పౌర్ణమిని మహా వైశాఖి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున చేసే ఏ ఆధ్యాత్మిక కార్యమైనా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతారు.
అయితే గౌతమ బుద్ధుడు మానవుని కష్టాలకు కారణం శోధిస్తూ దేశాటన చేస్తూ చివరకు గయలోని బోధి వృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు ‘కోరికలే మానవుని దుఃఖానికి కారణం’ అనే నగ్నసత్యాన్ని గ్రహించారు. ఈ విధంగా బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది. ఏ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బుద్ధ పూర్ణిమ రోజు ఆ బోధి వృక్షాన్ని పూజిస్తారు. అలాగే నేడు ఋషులకు ఆహారం, బట్టలు లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం అత్యంత పవిత్రమైన దానధర్మం భావిస్తారు.

Recent

- Advertisment -spot_img