Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ తీగ తగిలి బర్రె మృతి

విద్యుత్ తీగ తగిలి బర్రె మృతి

ఇదే నిజం, జగిత్యాల రూరల్ : మండలంలోని అంతర్గాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం(మే 23) రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా అంతర్గం గ్రామంలో పొలాల వద్ద విద్యుత్ స్తంభం తీగ తెగిపోయింది. పశువుల కాపరి పశువులను ఎప్పటిలాగే గురువారం మేతకు తోలుకొని వెళ్లాడు. విద్యుత్తు తీగ తెగి పొలంలో పడగా అటుగా వెళ్లిన బర్రె కు తీగ తగిలి మృతి చెందింది. ఇది గమనించిన పశువుల కాపరి బర్రె యజమాని బొందుగుల స్వామి రెడ్డికి తెలిపాడు. విద్యుత్ అధికారుల నిర్లక్షం వల్ల తన బర్రె మృతిచెందిందని రైతు బొందుగుల స్వామి రెడ్డి వాపోయారు. తన బర్రె మృతికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశాడు. అంతర్గం గ్రామ లైన్ మేన్ కు సమాచారం అందించారు. తనకు తనకు న్యాయం చేయాలని కోరాడు.

Recent

- Advertisment -spot_img