HomeEnglishబంపర్​ ఆఫర్​.. పిల్లల్ని కంటే 62 లక్షలు బోనస్

బంపర్​ ఆఫర్​.. పిల్లల్ని కంటే 62 లక్షలు బోనస్

దక్షిణ కొరియాలో ఈ మధ్య జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో ఈ ప్రభుత్వం.. ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగస్తులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సహాకాలను అందిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన బూయోంగో అనే నిర్మాణ సంస్థ కూడా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బిడ్డకు జన్మ నిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్‌గా 62 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బూయోంగో నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దాదాపుగా 44 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఈ ఆఫర్ మహిళలు, పురుషులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. జన్మనిచ్చిన ప్రతీ సారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img