ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమలులో ఉంటుంది.
మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.