HomeసినిమాBunny – Trivikram movie in two parts..! రెండు పార్ట్​లుగా బన్నీ– త్రివిక్రమ్ సినిమా..!

Bunny – Trivikram movie in two parts..! రెండు పార్ట్​లుగా బన్నీ– త్రివిక్రమ్ సినిమా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప–2’షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప–2 పై భారీ హైప్ నెలకొనగా.. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్​తో పాటు నార్మల్ ఆడియెన్స్​ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ ఫ్రాంచైజ్ చేసే ఛాన్స్ ఉందని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​తో మళ్ళీ చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ రెండు భాగాలుగా ఉండొచ్చని ప్రొడ్యూసర్ నాగవంశీ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఓ హింట్ ఇచ్చారు. ఇప్పుడు నడుస్తున్న సీక్వెల్స్ ట్రెండ్ లో తమ నుంచి కూడా ఏమన్నా సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఈ కాంబినేషన్ లో సీక్వెల్ ఉండొచ్చని ఆయన సమాధానం ఇచ్చారు. మరి దీనిపై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img