Homeహైదరాబాద్latest Newsయాదాద్రి జిల్లాలోని ఓ ఇంట్లో చోరీ..బంగారు ఆభరణాల అపహరణ

యాదాద్రి జిల్లాలోని ఓ ఇంట్లో చోరీ..బంగారు ఆభరణాల అపహరణ

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్‌పేటలోని ఓ ఇంట్లో దొంగలు విజృంభించారు. గ్రామానికి చెందిన గంగమల్ల లత పండగ నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇది గమనించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడుతో తాళాన్ని పగులగొట్టి ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు తిరిగి ఇంటికి వచ్చాక తాళం పగలగొట్టారని గ్రహించి చూసేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడవేసి ఉన్నాయి. దీంతో బాధితురాలు బంగారు ఆభరణాలు అపహరించారని గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img