Homeహైదరాబాద్latest Newsఇక Flipkart లో బస్ టికెట్ బుకింగ్..Hyderabad లో కూడా!

ఇక Flipkart లో బస్ టికెట్ బుకింగ్..Hyderabad లో కూడా!

Bus Ticket Booking system Introducing in Flipkart : ప్రముఖ ఈ కామర్స్‌ సేవల సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్‌ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతానికి బెంగళూరు, ఛండీగఢ్‌, దిల్లీ, జైపూర్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై, చెన్నైలలో ఈ టికెట్‌ బుకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి ఛార్జీలు లేకుండా బస్‌ టికెట్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నూతన సేవల ప్రారంభ సందర్భంగా ఈ నెల 15 వరకు 20 శాతం రాయితీని ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ సేవలను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img