Homeహైదరాబాద్latest Newsచిలుకలకు టికెట్ కొట్టిన కండక్టర్

చిలుకలకు టికెట్ కొట్టిన కండక్టర్

కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ బామ్మ నాలుగుచిలుకలతో బస్సు ఎక్కగా, కండక్టర్ ఆ చిలుకలకు 444 రూపాయలను టిక్కెట్ రూపంలో వసూలు చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.
అధికారుల కథనం ప్రకారం.. ఈ బామ్మ బుధవారం ఉదయం 8 గంటలకు తన మనవారిలితో కలిసి మైసూరుకు బయల్దేరారు. అయితే బామ్మకు, మనవరాలికి ఉచిత టిక్కెట్లు ఇచ్చిన కండక్టర్ చిలుకలకు ఒక్కో చిలుకకు రూ.111 చొప్పున నాలుగు చిలుకలకు రూ. 444 వసూలు చేశారు. బస్సులో చిలుకలను తీసుకెళ్లడానికి అనుమతించడమే కాక, వాటికి రూ. 444 టిక్కెట్ వసూలు చేయడం నెటిజన్లను ఆకర్షించింది. చిలుకలకు టిక్కెట్ కొట్టడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కేఎస్ఆర్టీసీ నిబంధనల మేరకు పెంపుడు జంతువులకు, పక్షులకు టిక్కెట్ తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయితే కండక్టర్ మాత్రం ఈ బామ్మ, మనవరాలికి శక్తి యోజన కింద ఉచిత టిక్కెట్ ఇచ్చారు. కానీ చిలుకలకు మాత్రం ‘చిల్డ్రన్’ కోటాలో, ఒక్కో దానికి 111 రూపాయల చొప్పున హాఫ్ టిక్కెట్ కొట్టారు. ఇలా మొత్తం 4 చిలుకలకు 444 రూపాయల టిక్కెట్లు కొట్టి, ఆ మొత్తాన్ని సదరు మహిళ నుంచి వసూలు చేశారు.

Recent

- Advertisment -spot_img