Homeహైదరాబాద్latest Newsఅయితే ఫోన్ సీజ్ చేస్తారా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అయితే ఫోన్ సీజ్ చేస్తారా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఫోన్ సీజ్‌ చేయడాన్ని ఎక్స్ (X) వేదికగా తప్పుబట్టారు.

“ఆరోప‌ణలను ఆధారాలతో ఎదుర్కోవాలి. దౌర్జ‌న్యంగా అక్ర‌మ కేసు పెట్టి, సెల్‌ఫోన్‌ను సీజ్ చేస్తారా? కుంభకోణం కచ్చితంగా జరిగింది. ప్రజల దృష్టి మరల్చ‌డానికే త‌మ యువ‌నేత, మ‌న్నె క్రిశాంక్ ఫోన్ సీజ్ చేశారు. దీన్నే పోలీసు భాషలో Attention Diversion MO అంటారు. ఈ గ్యాంగ్‌లు బ్యాంకుల ముందు తచ్చాడుతాయి. ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలనెత్తుకొని పారిపోతాయి. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లు తెలంగాణలో రాజ్యమేలుతున్నాయి.” అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిపడ్డారు.

చిత్ర‌పురి సిటీలో రూ.3 వేల కోట్ల భూదందా జ‌రిగింద‌ని క్రిశాంక్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Recent

- Advertisment -spot_img