Homeహైదరాబాద్latest Newsబీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం

బీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం అరేపెళ్లి గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. శివాలయంలో పూజల అనంతరం నాయకులు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వం చేసిన పనులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి కొప్పుల ఈశ్వర్ ని ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యొరి రాజేష్, బీఆర్ఎస్ రైతు నాయకులు సౌళ్ల భీమన్న,వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మోగిలి శేఖర్, ఎంపీటీసీ కుంబల రవిత రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిసక తిరుపతి, గడ్డం బాలరాజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img