HomeHealthఫోన్ లేకుండా ఒక్క గంట ఉండగలరా? - Can you stay without the phone...

ఫోన్ లేకుండా ఒక్క గంట ఉండగలరా? – Can you stay without the phone for an hour?

Can you stay without the phone for an hour?

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : మొబైల్ ఫోన్. అరచేతిలో ఇమిడిపోయి ప్రపంచాన్ని మన కళ్ల ముందు ప్రతిష్టించే ఈ చిన్ని పరికరం కాలక్రమంలో మానవాళి జీవన మనుగడకు పెనుముప్పుగా తయారవుతోంది. నిద్రలేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునేవరకు మొబైల్ లేకపోతే ఏ పనీ తోచదు. ఫోన్, మెసేజ్ రాకున్నా తరచూ ఫోన్ తీసి చూడటం పరిపాటి అయింది. నిత్యం ఆన్‌లైన్‌లో ఉన్నామా! లేదా !ఏమైనా మెసేజ్ వచ్చిందా చెక్ చేసుకుంటుంటారు. ఏ పని చేసినా పక్కన ఫోన్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అంతలా అడిక్ట్ అయ్యారు ప్రజలు. దీంతో ప్రశాంతత కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడింది. నలుగురితో మాట్లాడే అవకాశం లేకుండా పోతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దెబ్బ పడుతోంది. కొందరైతే రోజంతా రూంలోనే ఉంటూ ఫోన్‌తో గడిపేస్తుంటారు. ఇటువంటి కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఫోన్‌ను అపరిమితంగా వాడటం వల్ల రియల్ వరల్డ్‌కు దూరమై వర్చువల్ వరల్డ్‌ అలవాటు అవుతుంది. తద్వారా మీరు బయటి ప్రపంచాన్ని ఎంజాయ్ చేయలేరు. ఆస్వాదించలేరు. మానసిక సమస్యలు, కుటుంబ రిలేషన్స్, సన్నిహితుల నుంచి విమర్శలు, సాన్నిత్యాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆకలిగా లేకపోవడం, బరువు తగ్గడం, నిద్రలేమి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ ఎంత వేగంగా వృద్ధి చెందినా అంతిమంగా హ్యూమన్ రిలేషన్స్ ప్రధానం. మీ తోటి వారితో సరదాగా గడిపే సమయాన్ని ఫోన్ లాగేస్తుంది. పరిమితికి లోబడి ఎంత తక్కువగా phone ఉపయోగిస్తే అంతగా మీరు బయటి ప్రపంచానికి కనెక్ట్ అవుతారు. అవసరం మేరకు మాత్రమే ఫోన్ యూజ్ చేయడం కష్టమే కానీ మీ ఆరోగ్యం కోసం మీరు కాకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారు?

Recent

- Advertisment -spot_img