Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు

శ్రీశైలంలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు

– వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి

ఇదేనిజం, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం దేవస్థానంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.శనివారం వైకుంఠ ఏకాదశి., తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు కావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో డిసెంబరు 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు సార్లు స్వామివారి స్పర్శ దర్శనానికి అకాశం కలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. కాగా, శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏకాదశి రోజు తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, రావణ వాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో పూజలు చేసి.. స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం గుండా తీసుకొచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు వెల్లడిరచారు.

Recent

- Advertisment -spot_img