HomeTelugu Newsప్రకృతి పందిరి వేసిందా!

ప్రకృతి పందిరి వేసిందా!

– ఆహ్లాదకరంగా విట్టంపేట రోడ్డు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: ఎండలకు రోడ్డు ఎక్కాలంటే భయపడే జనం.. మెట్ పల్లి మండలం విట్టంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో ప్రయాణించుటకు జనం ఉవ్విలూరుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా దొంగల మర్రి నుంచి విట్టంపేట్, మెట్లచిట్టాపూర్ వరకు దాదాపు కిలోమీటర్ వరకు రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటారు. ఈ మొక్కలు కాస్త పెరిగి ఒకదానికి మరొకటి తాకడం వల్ల ఆకాశానికి పందిరి వేసినట్టుగా ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. వెల్లుల్ల బండలింగపూర్ గ్రామ యువకులు ఉదయం, సాయంత్రం ఈ మార్గంలో వాకింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. సమీప గ్రామాల యువకులు ప్రకృతిలో మమేకమై ఫోటోలు దిగుతున్నారు.

Recent

- Advertisment -spot_img