HomeసినిమాAkhil Akkineni: మ్యారేజ్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయ‌లేక‌పోతున్నా.. అఖిల్ అక్కినేని

Akhil Akkineni: మ్యారేజ్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయ‌లేక‌పోతున్నా.. అఖిల్ అక్కినేని

హైద‌రాబాద్ః అఖిల్ అక్కినేని హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు.

‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు అభిమానుల‌ను అలరిస్తోంది.

‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే… అయ్యయ్యయ్యయ్యో..’ అని చెబుతూ టీజ‌ర్‌లో అఖిల్ ఊగిపోయాడు.

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాకు బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది.

ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img