HomeసినిమాRam Charan​ నెక్ట్స్​ మూవీకి కాస్టింగ్ కాల్..

Ram Charan​ నెక్ట్స్​ మూవీకి కాస్టింగ్ కాల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ అనే పొలిటికల్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్​లో రామ్​చరణ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ చాలా పవర్​ఫుల్​ కంటెంట్​తో ఉంటుందని టాలీవుడ్​లో టాక్​ వినిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్‌ కాస్టింగ్ కాల్​ను ప్రకటించారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి యాసలో మాట్లాడగలిగే వారు వయసుల వారీగా తమ ప్రొఫైల్స్​ను పంపించాల్సిందిగా కోరారు. ఆడిషన్స్ కోసం మెయిల్ ఐడీ, వాట్సాప్​ నంబర్​ను షేర్ చేశారు. ఈ సెన్సేషన్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాపై రామ్​ చరణ్ ఫ్యాన్స్, ఆడియెన్స్​లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img