Homeఆంధ్రప్రదేశ్CBI:సీబీఐ దర్యాప్తునే తప్పు పడతారా?

CBI:సీబీఐ దర్యాప్తునే తప్పు పడతారా?

సీబీఐ దర్యాప్తునే తప్పు పడతారా?

  • గంగిరెడ్డికి అవినాశ్ ఎందుకు కాల్ చేశారు?
  • సునీత్ వాంగ్మూలం క్లియర్ గా ఉంది..
  • ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్

ఇదేనిజం, ఢిల్లీ: సీబీఐకి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. అసలు 95 పేజీల లేఖ అవినాశ్ రెడ్డే రాశారా.. అని ప్రశ్నించారు. సోమవారం రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి సిగ్గు, లజ్జ లేకుండా ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెడ్డి అందరితో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారని ఆరోపించారు. గంగిరెడ్డి ఫోన్ నుంచి అవినాష్ రెడ్డి ఫోన్‌కు ఎందుకు అన్ని సార్లు వెళ్లిందని నిలదీశారు.. అజయ్ కల్లం ఒక టైం చెప్పారు.. ఉమారెడ్డి టైం గుర్తు లేదని అన్నారు.. వివేకా హత్య జరిగిన రాత్రి రెండు గంటలకు కూడా అవినాష్ ఫోన్ మాట్లాడారన్నారు. భారతి కూడా హడావుడిగా సునీత ను కలిశారని.. దీనిపై సునీత స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారన్నారు. ఇంత ఎర్రిపప్పల దొరికేస్తారాని అనుకోలేదన్నారు. సీబీఐ ఛార్జిషీట్‌ను అవినాష్ రెడ్డి తప్పుపట్టడం ఏంటన్నారు. సునీత స్టేట్మెంట్ చాలా క్లియర్‌గా ఉందని, అడ్డంగా దొరికారని, త్వరలో మరికొంతమంది పేర్లు వస్తాయన్నారు. బైజూస్‌ కు ఏ విధంగా టెండర్లు ఇచ్చారని రఘురామ ప్రశ్నించారు. ఏడాదికి మాత్రమే కంటెంట్ ఉచితంగా ఇస్తామని బై జూస్ ఒప్పందం చేసుకుందని, పిల్లలకు మళ్ళీ కొత్త ట్యాబ్ ఇస్తారా? అని అన్నారు. వైసీపీ పార్టీపై తిరుగుబాటు మొదలైందని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు హ్యాట్సాఫ్.. ఆయనకు కానీ, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పులిలా చెప్పారని రఘురామ అన్నారు.

Recent

- Advertisment -spot_img