Homeజిల్లా వార్తలుఘనంగా వివేకానంద 161వ జయంతి వేడుకలు

ఘనంగా వివేకానంద 161వ జయంతి వేడుకలు

ఇదే నిజం, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ పరిధిలోని డిండి మండల కేంద్రంలో వివేకానంద 161 వ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి గొర్రె కార్తీక్, నగర కార్యవర్గ సభ్యుడు పిల్లి సన్నీ బాబు, జాయింట్ సెక్రటరీ పులి ఆంజనేయులు, నగర వైస్ ప్రెసిడెంట్ అక్షయ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img