Homeజిల్లా వార్తలునీట్ పరీక్ష ఫలితాలపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

నీట్ పరీక్ష ఫలితాలపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఇదేనిజం, జగిత్యాల: NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ అదేశం మేరకు జగిత్యాల అధ్యక్షుడు చెట్టే భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జగిత్యాల పట్టణ ఎన్ ఎస్ యు ఐ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు దగ్నం చేయడం జరిగింది. 2024 neet పరీక్ష ఫలితాలలో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ఫలితాలను రద్దుచేసి తిరిగి neet పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

నీట్ పరీక్షల అవకతవకలు జరిగిన విషయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకులకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు.720 మార్కులకు గాను 720 మార్కులు సాధించినట్టుగా అదేవిధంగా జూన్ 14వ తేదీకి ప్రకటించవలసిన ఫలితాలను ఆగ మేఘాల పైన జూన్ 4వ తారీఖున ప్రకటించడం ఫలితాలలో మైనస్ మార్కులు ఉన్నప్పటికీ 718 ,719 మార్కులు రావడం ఆశ్చర్యంకలిగించిందని ఒకే పరీక్ష కేంద్రం నుండి 6 మందికి ఒకటో ర్యాంకు రావడం మరియు 67 మందికి ఒకటో ర్యాంకు రావడం ఇదే తొలిసారి ఇలా ఫలితాలు రావడం అనుమానాలతో కూడుకున్నదని నేటి ఫలితాలను రద్దుచేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img