Homeఫ్లాష్ ఫ్లాష్కొవిడ్‌-19 వ్యాక్సిన్ రేసులో 30 ఫార్మా కంపెనీలు

కొవిడ్‌-19 వ్యాక్సిన్ రేసులో 30 ఫార్మా కంపెనీలు

పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించిన హెల్త్ మినిస్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌
న్యూఢిల్లీః కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ, సహాకారాలు అందజేస్తోందని సెంట్ర‌ల్‌ హెల్త్ మినిస్ట‌ర్ హర్షవర్ధన్‌ తెలిపారు. దేశంలో 4 ఫార్మాకంపెనీలు త‌యారు చేస్తున్న వ్యాక్సిన్లు ప్రీ క్లినిక‌ల్ ద‌శ‌లో ఉన్నాయ‌ని, మ‌రో మూడు 1, 2, 3 ఫేజ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉన్నాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. దేశంలోని వ్యాక్సిన్‌ తయారీలో ఉన్న 30 ఫార్మా సంస్థలకు కేంద్రం త‌న‌వంతు స‌హాయం అంద‌జేస్తుంద‌న్నారు. పీఎం కేర్స్‌ నిధి నుంచి రూ.893.93 కోట్ల విరాళం వ‌చ్చంద‌ని, దాంతో 50 వెంటిలేట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని మంత్ర పార్లమెంట్‌కు తెలియ‌జేశారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, అహ్మదాబాద్‌ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలాల వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పై కేంద్రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ తయారీలో 145 సంస్థలు వ్యాక్సిన్ త‌యారీలో ఉన్నాయ‌న్నారు. వీటిలో 35 మాత్ర‌మే క్లినిక‌ల్ ద‌శ‌లో ప్ర‌వేశించిన‌ట్లు మంత్రి తెలిపారు.

Recent

- Advertisment -spot_img