అమేథీ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమిపాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి కేఎల్ శర్మ చేతిలో 70 వేల ఓట్ల మెజార్టీలో పారాజయం చెందారు. గత 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీపై 55000 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. కానీ ఈసారి ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు శర్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించడంతో ఫలితం తారుమారైంది.