Homeహైదరాబాద్latest NewsChampions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ..ప్లేయింగ్ 11 అంచనా...

Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ..ప్లేయింగ్ 11 అంచనా ఇదే..!

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిన్నటి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నేడు భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నాం 2.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొదటి మ్యాచ్ లో విజయఢంకా మోగించి బోణి కొట్టాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

పిచ్‌ ఎలా ఉందంటే..?
ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్ సందర్భంగా పిచ్‌ ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ పిచ్‌ల క్యూరేటర్‌ మాథ్యూ సాండ్రే కీలక విషయాలు వెల్లడించాడు. ‘నిలకడగా బౌన్స్‌ లభించినా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఫోర్లు, సిక్స్‌లే కదా ప్రేక్షకులను తీసుకొచ్చేది. అందుకే భారీ మార్పుల జోలికి మేము పోలేదు’ అని వెల్లడించారు.

భారత్ ప్లేయింగ్ 11 అంచనా:
రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 అంచనా:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్

Recent

- Advertisment -spot_img