Champions Trophy: భారత క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి ఎందుకంటే ఇద్దరు స్టార్ ప్లేయర్లున్యూజిలాండ్ మ్యాచ్ కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ రెండు మ్యాచ్ లు గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్ ప్రాక్టీస్ కు హాజరుకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. న్యూజిలాండ్ తో ఆదివారం భారత్ తలపడనుంది. ఈ పరిస్థితిలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో వీరిద్దరూ ఆడతారా? లేదా ఎలాగో సెమీఫైనల్ కు చేరిపోయారు కాబట్టి వీరికి రెస్ట్ ఇస్తారో వేచి చూద్దాం.