Homeహైదరాబాద్latest Newsరూ. 27 కోసం 28,000 కట్టారు

రూ. 27 కోసం 28,000 కట్టారు

cab services : ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌కు షాక్ తగిలింది. ఓ ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా తీసుకున్నందుకు గాను రూ.28000 జరిమానా కట్టాల్సి వచ్చింది. ఛండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ ఫైన్‌ను విధించింది. అదనంగా తీసుకున్న రూ.27తో పాటు బాధితుడు రిత్విక్‌గార్గ్‌కు రూ.5000 పరిహారం, రూ.3000 ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఉబెర్ ఇండియాను కమిషన్ ఆదేశించింది. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండేందుకు కమిషన్ లీగల్ ఎయిడ్ ఖాతాలో రూ.20,000 జమ చేయాలని తెలిపింది.

Recent

- Advertisment -spot_img