HomeతెలంగాణChandrababu arrest: చంద్రబాబు అరెస్ట్​ వెనక ఢిల్లీ కుట్ర

Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్​ వెనక ఢిల్లీ కుట్ర

– హస్తిన పెద్దలకు తెలియకుండా జరిగే చాన్స్​ లేదు
– కాంగ్రెస్​ సీనియర్​ నేత చింతా మోహన్​

Chandrababu arrest: ఇదేనిజం, హైదరాబాద్​: చంద్రబాబును అరెస్ట్​ చేయడం వెనక ఢిల్లీ పెద్దల కుట్ర దాగి ఉందని కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్​ ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. హస్తిన పెద్దలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్​ జరిగే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని చెప్పుకొచ్చారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్​ పై ఇటీవల వరసగా పలు పార్టీలకు చెందిన నేతలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇక స్కిల్​ డెవలప్​ మెంట్​ స్కామ్​ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్​ జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img